
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan)పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చిలోని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన పోలీసులకు తెలిపారు. అయితే, ఉన్ని ముకుందన్ వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాతే అతనిపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉన్ని ముకుందన్ రీసెంట్‌గా మార్కో సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన యాక్ట్ చేశాడు.
విపిన్ కుమార్ ఒకప్పుడు ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్‌గా పనిచేశాడు. ఆయన సినిమాకు సంబంధించిన అన్ని షెడ్యూల్స్‌తో పాటు తన రెమ్యునరేషన్ వంటి వివరాలను కూడా ఆయనే చూసుకునే వాడు. అయితే, కొద్దిరోజుల క్రితం పల కారణాల వల్ల విపిన్‌ను మేనేజర్‌గా నటుడు ముకుందన్ తొలగించాడు. అయితే, తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేపించారని విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'నటుడి అనుచరులు నా ఫ్లాట్ వద్దకు వచ్చారు. నన్ను పార్కింగ్ ఏరియాకు పిలిపించి దాడి చేశారు. వారు నా ఇంటి అద్దాలను కూడా పగలగొట్టారు. తన వరుస సినిమాలు పరాజయం పాలవడంతో ఉన్ని నిరాశలో ఉన్నాడు. ఆ బాధను చాలా మందిపై మోపుతున్నాడు. నేను కూడా ఒక చిత్రనిర్మాతను అనే విషయం మరిచిపోతున్నాడు. ఆయన చాలా సినిమాలకు నేను పనిచేశాను. అతని కొత్త సినిమా 'నరివెట్ట' గురించి నేను మాట్లాడినందుకే దాడి చేశారు. అతని(ఉన్ని ముకుందన్) గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెబుతాను.' అని పోలీసుల వాంగ్మూలంలో విపిన్ తెలిపారు. కానీ, ఉన్ని ముకుందన్‌పై సోషల్‌మీడియాలో చాలా నీచమైన పోస్టులను విపిన్ కుమార్ షేర్ చేశారని, అందుకే ఆయన అభిమానులు దాడి చేశారని కొందరు చెబుతున్నారు. ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీమ్ గానీ స్పందించలేదు.