
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్‌తో రిలేషన్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.
పార్ట్‌నర్‌షిప్
గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్‌లో ఆమెను పార్ట్‌నర్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు.

కెనీషా ఎమోషనల్
జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్