
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో సామాన్యుల మధ్య పోటీ జరుగుతోంది. వీరిలో టాప్ 15 సెలక్షన్ జరిగిపోయింది. ఈ పదిహనుమంది మధ్యలో గేమ్స్ పెట్టి ఐదు లేదా తొమ్మిది మందిని ఎంపిక చేసి బిగ్‌బాస్ 9వ సీజన్‌కు పంపించనున్నారు. మరి ఎలాంటి టాస్కులు పెట్టారు? అసలు టాప్ 15లో ఎవరున్నారనేది నేటి (ఆగస్టు 27) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..
టాప్ 15 వీళ్లే..
ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, సైనికుడు పవన్ పడాల, దాలియా, కల్కి, షాకిబ్, శ్వేతా శెట్టి, దివ్య వేలమురి, శ్రేయ, డిమాన్ పవన్, నాగ ప్రశాంత్, హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్).. వీరందరూ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో టాప్ 15కి చేరారు. వీరందరికీ నాగార్జున ఆల్ ద బెస్ట్ చెప్పిన వీడియో ప్లే చేయడంతో కంటెస్టెంట్లు సంతోషించారు. ఇక షో అంతా అరగుండుతో ఉండాల్సిందే అని మాస్క్ మ్యాన్‌కు పెట్టిన కండీషన్‌ను తీసేశారు. అరగుండు ఎందుకులే అంటూ బిందుమాధవి అతడికి గుండు గీసింది.
రెండు టీమ్స్..
వీళ్లందరికీ 1 నుంచి 15 వరకు స్టాండ్స్ ఇచ్చి.. మీకు అర్హత ఉన్న స్థానాల్లో నిలబడమన్నారు. దీంతో చాలామంది మొదటి మూడు స్థానాల కోసం పోటీపడ్డారు. నీకంటే నాకే అర్హత ఉంది, నువ్వు ఎమోషనల్‌గా వీక్.. ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ర్యాంకుల కోసం కొట్లాట జరిగింది. ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవాలన్న టాస్క్‌ను గుర్తు చేసిన మనీష్.. కల్కి ముందే ప్లాన్ చేసి తన ఫ్రెండ్‌కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండమని చెప్పడంతో ఆ గేమ్ తను గెలిచేసిందన్నాడు. అది నిజం కాదని కల్కి ఎక్కువగా వాదించకపోవడంతో ఒకరకంగా తను దాన్ని ఒప్పుకున్నట్లుగానే కనిపించింది.
ఓట్ అప్పీల్
ఇక ఈ గేమ్‌లో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న వారిని రెడ్ టీమ్‌గా, తర్వాతి ఆరు స్థానాల్లో ఉన్నవారిని బ్లూ టీమ్‌గా విడదీశారు. చిట్టిచివర్లో 15వ స్థానంలో ఉన్న దాలియాను సంచాలక్‌గా పెట్టారు. ఈ గేమ్‌లో ప్రసన్నకుమార్‌ను సంచాలక్ అన్యాయంగా ఎలిమినేట్ చేసింది. దీంతో ఆట యూటర్న్ తిరిగింది. బ్లూ టీమ్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. టీమ్ లీడర్ ప్రియ.. చివరి వరకు ఆడి గెలిపించిన పవన్ పడాలను సెలక్ట్ చేసింది. దీంతో అతడు ఓట్లేయమని అడిగాడు.
చెత్త ప్లేయర్
బిందుమాధవి.. వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్‌గా కల్కిని ప్రకటించింది. వాల్యుబుల్ ప్లేయర్‌గా శ్రీజను ప్రకటించగా ఆమె స్టేజీపైకి వచ్చింది. దమ్ము మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉంది. నా వాయిస్ చిరాకుగా ఉన్నా ఆట ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఒక్క ఛాన్సిస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా అని తనకు ఓటేయమని అభ్యర్థించింది. ఆమె చలాకీతనం చూసిన అభిజిత్.. నువ్వు షోలో ఉండొద్దని రెడ్ కార్డ్ చూపించా.. కానీ, ఇప్పుడు నా మనసు మారిందన్నాడు.
చదవండి: ఒక్కసారిగా కళ్లముందుకు.. మనసంతా సంతోషంగా ఉంది: నిహారిక