
నిన్నటి రోజు నాకెంతో ప్రత్యేకం అంటోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela). తన రెండు ప్రపంచాలు ఒకేసారి కళ్ల ముందు తిరిగాయంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా రెండు ప్రపంచాలు ఒకే చోటకు చేరాయి. ఒకటేమో కెమెరా ముందుకు వచ్చాను.. అందుకోసం తయారయ్యాను, డ్యాన్స్ చేశాను, చాలా సరదాగా ఉన్నాను. మరొకటేమో.. నా ప్రొడక్షన్ హౌస్‌లో రెండో సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీకి సంబంధించిన పనులు చూసుకున్నాను.
రెండూ ఇష్టమే..
యాక్టింగ్, ప్రొడక్షన్.. ఈ రెండూ నాకెంతో ఇష్టమైనవి. వీటిలో ఏది ఎక్కువ? అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజాయితీగా నిజం చెప్పాలంటే నేను ఏదో ఒకదాన్ని అస్సలు ఎంపిక చేసుకోలేను. యాక్టింగ్ అనేది నా ప్యాషన్... సినిమాలు ప్రొడ్యూస్ చేయడమనేది.. నేను ఎదగడానికి తోడ్పడింది, అందుకోసం నేనెంతో కష్టపడ్డాను. కాబట్టి రెండూ ముఖ్యమైనవే!
కళ్లముందు..
నిన్న అదే రుజువైంది. మాటల్లో చెప్పకపోయినా చేతల్లో తెలిసిపోయింది. ఓ రియాలిటీ షోకు గెస్ట్‌గా వెళ్లి కెమెరా ముందు కనపడ్డాను. ఆ పక్కనే ఉన్న బిల్డింగ్‌లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఆఫీస్‌కు వెళ్లి నిర్మాతగా నా నెక్స్ట్ సినిమా పనులు చూసుకున్నాను. నా జర్నీ అంతా ఒక్కసారిగా కళ్లముందు తిరిగేసరికి మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చింది.
నిహారిక జర్నీ..
నిహారిక కొణిదెల.. ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్‌కారన్ మూవీస్ చేసింది. ప్రస్తుతం మంచు మనోజ్‌తో వాట్ ద ఫిష్ మూవీలో యాక్ట్ చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా రిలీజ్ చేయగా ఇది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్‌లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది.