సింగర్‌తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి! | Actor Ravi Mohan stars in Keneeshaa single amid divorce with Aarti | Sakshi
Sakshi News home page

Jayam Ravi: భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో సాంగ్‌.. జయం రవి స్పెషల్‌ వీడియో!

Jun 17 2025 4:37 PM | Updated on Jun 17 2025 4:49 PM

Actor Ravi Mohan stars in Keneeshaa single amid divorce with Aarti

కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్‌లో ఉందంటూ వార్తలొచ్చాయి. 

ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్‌ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్‌పై మరింత టాక్‌ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.

సాంగ్‌లో జయం రవి ప్రత్యక్షం..

తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్‌పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement