గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తోన్న హీరో జయం రవి. తన భార్య వేధింపులతో విసిగిపోయానని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని కూడా అన్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ చేశారని.. కనీస గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదన్నారు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదం తర్వాత జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్ కొనసాగించారు. కానీ ఇటీవలే సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు.
అయితే తాజాగా కెనీషా మరో షాకిచ్చింది. సడన్‌గా జయం రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీరిద్దరు కలిసి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైవు జయం రవి ఇటీవలే లోకేశ్ కనగరాజ్ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Ravi Mohan and Kenisha reunite after separation! pic.twitter.com/xjT0mYi6ip
— Princy (@Mrking1618) June 9, 2026


