తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్‌లో వైరల్‌గా మారింది.
ఇంకా పెళ్లవలేదు!
రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్‌మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
పేరు మార్పు
కాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్‌గా నటించాడు.


