నా అంతగా ఎవరూ ప్రేమించలేరు, అదే నీకిచ్చే గిఫ్ట్‌: విజయ్‌ ఆంటోని | Vijay Antony Celebrates Wife Fatima Birthday With Heartfelt Tribute, Shares Personal Love Note On Instagram | Sakshi
Sakshi News home page

Vijay Antony: మై డియర్‌ పట్టు, నువ్వు నా సర్వస్వం.. ఐ లవ్యూ..

Mar 29 2026 10:48 AM | Updated on Mar 29 2026 12:12 PM

Vijay Antony Birthday Wishes to Wife Fatima and Gifts a Promise

విజయ్‌ ఆంటోనీ సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతడు హీరోగా మారాడు. కొన్ని సినిమాలకు తనే ఎడిటర్‌గానూ వ్యవహరించాడు. లిరిసిస్ట్‌గా, సింగర్‌గానూ టాలెంట్‌ చూపించాడు. అయితే విజయ్‌ ఆంటోని వైవాహిక జీవితం మొదలుపెట్టాకే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.

నువ్వే నా ప్రపంచం
అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఎంతో అందంగా ఉంటుందీ జంట. నేడు (మార్చి 29న) ఫాతిమా పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య కోసం స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు విజయ్‌. మిసెస్‌ విజయ్‌ ఆంటోని.. మై డియర్‌ లవ్‌, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా యజమానివి. మై డియర్‌ పట్టు.. ఈరోజు నేను చేస్తున్న వాగ్ధానమే నీకిచ్చే బహుమతి. నీ జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఆఖరికి భగవంతుడు కూడా నీ జీవితంలో నా అంత ప్రేమను పంచలేడు.

సినిమా
నువ్వు నా సహచరివి, సర్వస్వానివి, నా జీవితానికే పరమార్థానివి.. ఐ లవ్యూ అని రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం విజయ్‌ ఆంటోని నూరు సామి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో వంద దేవుళ్లు పేరిట రిలీజ్‌ కానుంది. బిచ్చగాడు డైరెక్టర్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: సినిమాలు మానేయాలని కండీషన్‌.. హీరోతో పెళ్లి రిజెక్ట్‌ చేశా: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement