సినిమాలు మానేయాలని కండీషన్‌.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్‌ | Mumtaz Reveals Reason Behind Refused To Marry Shammi Kapoor And Shares Insights On Traditional Family Pressures | Sakshi
Sakshi News home page

Mumtaz: పెళ్లయితే కెరీర్‌ వదిలేయాలని కండీషన్‌.. నాకేమో సినిమాలు చేయాలని ఆశ!

Mar 29 2026 9:51 AM | Updated on Mar 29 2026 12:53 PM

Mumtaz Reveals Reasonfor Refusing to marry Shammi Kapoor

ఒకప్పుడు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణించింది ముంతాజ్‌. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్‌ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. 

పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..
మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. 

నా భర్త ఓపికగా ఎదురుచూశాడు
కానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్‌ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్‌లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్‌లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్‌ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్‌ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.

చాలా చిన్నదాన్ని
నటుడు షమ్మీ కపూర్‌తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్‌ కపూర్‌.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్‌ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. 

పర్సనల్‌ లైఫ్‌
ఆయన పెట్టిన కండీషన్‌ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్‌.. షమ్మీ కపూర్‌ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్‌ చేసే మయూర్‌ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.

చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement