వెంకటేశ్-అనిల్ రావిపూడి.. మళ్లీ ఆయనతోనే | Venkatesh And Anil Ravipudi New Movie Update Latest | Sakshi
Sakshi News home page

Venky Anil Ravipudi: శ్రీరామనవవి.. అనిల్-వెంకీ మూవీ అప్‌డేట్

Mar 27 2026 5:46 PM | Updated on Mar 27 2026 5:49 PM

Venkatesh And Anil Ravipudi New Movie Update Latest

ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. కొన్నాళ్ల క్రితమే వెంకటేశ్-కల్యాణ్ రామ్ కాంబోలో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం త్వరలో లాంఛనంగా మొదలు కాబోతుంది. ఇంతలోనే ఒక్కో అప్‌డేట్ రివీల్ చేస్తున్నారు. తాజాగా నిర్మాతలు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)

అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి', 'మన శంకరవరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. మూడోసారి ఈ మూవీ కోసం కలిసి పనిచేయబోతున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నాయి. ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇందులో వెంకటేశ్, కల్యాణ్ రామ్‌కి జంటగా కీర్తి సురేశ్, కృతిశెట్టిలని అనుకుంటున్నారని గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. త్వరలో హీరోయిన్లపై క్లారిటీ ఇవ్వడంతో పాటు లాంఛనంగా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలానే సంగీత దర్శకుడిగా భీమ్స్‌నే అనిల్ తీసుకుంటాడా? లేదా వేరే వాళ్లకు అవకాశమిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

(ఇదీ చదవండి: హరీశ్ శంకర్‌కి ఇంకా అర్థం కావట్లేదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement