ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన | Suhas Hey Balwanth Movie OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

Hey Balwanth OTT: తండ్రి చేసే సీక్రెట్ బిజినెస్.. కొడుక్కి తెలిస్తే?

Mar 27 2026 1:29 PM | Updated on Mar 27 2026 1:37 PM

Suhas Hey Balwanth Movie OTT Release Date Latest

టాలీవుడ్‌లో అడపాదడపా కామెడీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా గత నెలలో సుహాస్ హీరోగా చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో కొందరికి నచ్చగా.. మరికొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమైనా సరే యావరేజ్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)

సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement