ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 27-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Mar 27 2026 4:06 AM | Updated on Mar 27 2026 4:52 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి ప.12.31 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పునర్వసు సా.5.40 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.24 నుండి 7.54 వరకు, తదుపరి రా.1.19 నుండి 2.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.14 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.17 వరకు, అమృత ఘడియలు: ప.3.24 నుండి 4.54 వరకు, శ్రీరామనవమి.

సూర్యోదయం : 6.02
సూర్యాస్తమయం :  6.07
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగ  ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో  మరింత పురోగతి కనిపిçస్తుంది.

వృషభం.... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

మిథునం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ధన, వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర సంఘటనలు.

కర్కాటకం.... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో  ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ప్రయాణాలు..

సింహం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య.... దూరపు బంధువుల నుంచి ఉపయుక్త సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన  ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలు.

తుల.. శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో విరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో మాటపడతారు.

వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలోæ చికాకులు. అనుకోని ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళం.

ధనుస్సు.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పనుల్లో విజయం. వాహనయోగం. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

మకరం.... కొత్త పనులు చేపడతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం.... కొన్ని పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

మీనం..... ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. ఆస్తుల వివాదాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement