నాపై డేటింగ్‌ రూమర్స్.. చివరికీ వాడు కూడా నవ్వుతున్నాడు..! | Malaika Arora son Arhaan react to her dating rumours | Sakshi
Sakshi News home page

Malaika Arora: నాపై డేటింగ్‌ రూమర్స్.. ఏ మగాడిని కోరుకోవడం లేదు.!

Mar 27 2026 3:44 PM | Updated on Mar 27 2026 3:53 PM

Malaika Arora son Arhaan react to her dating rumours

బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిసిన ముద్దుగుమ్మ.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్‌ను పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా రాణిస్తోంది.

అయితే మలైకా పర్సనల్‌ లైప్‌ ఎప్పుడు ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి.

తాజాగా తనపై వస్తున్న రూమర్స్‌పై మలైకా అరోరా స్పందించింది. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. వాటిని చూసి నా కుమారుడు అర్హాన్ ఖాన్‌, నేను జోకులు వేసుకుంటున్నామని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మలైకా.. తన పర్సనల్‌ లైఫ్‌పై వస్తున్న వాటిని చూసి నా ఫ్యామిలీ కూడా నవ్వుతూ సరదాగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రేమ విషయంలో తొందరపడటం లేదని.. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నట్లు మలైకా చెప్పింది.

స్వయంకృషితో ఎదిగా..

మలైకా మాట్లాడుతూ.. ' సింగిల్‌గా ఉండడమే నాకు ప్రేరణ. మొదటి నుంచి అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సహవాసం, భాగస్వామి, అవన్నీ అందమైనవే. కానీ నాకు ఒక భాగస్వామి కావాలి అన్నట్టుగా నేను వాటి కోసం  వెతకడం లేదు. నేను స్వయంకృషితో ఎదిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా  వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరమూ లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా కలిసి ఉండాల్సి వస్తే.. అది నా సొంత రూల్స్‌ ప్రకారమే ఉంటుంది." తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement