శరీర నిర్మాణానికి, కండరాల బలానికి ప్రోటీన్ ఎంతగానో అవసరం. శాకాహారం, మాంసాహారం ఏదైనా సరే, శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- మన శరీరంలోని అవయవాల నిర్మాణానికి ప్రోటీన్ ప్రాథమిక పునాది. ఇది దెబ్బతిన్న కణజాలాలను త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
- ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- ఆహారం అరగడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఈ ప్రక్రియలో మెటబాలిజం రేటును పెంచి, శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది.
- వ్యాయామం లేకపోవడం వల్ల, వయస్సు పెరగడం వల్ల కండరాల క్షీణత జరుగుతుంది. ప్రోటీన్ కండరాల ద్రవ్యరాశిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
- వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి.
- చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పనీర్, గింజలు, చియా సీడ్స్‌లో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో ?
రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్


