స్ట్రాబెర్రీ టైగర్‌ను చూసారా? | Strawberry Tiger named Ava has become an internet sensation | Sakshi
Sakshi News home page

స్ట్రాబెర్రీ టైగర్‌

Mar 28 2026 2:36 PM | Updated on Mar 28 2026 2:47 PM

Strawberry Tiger named Ava has become an internet sensation

ఈ అందమైన పులిని చూసారా? దీని పేరు ‘అవా’. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియా స్టార్‌. థాయిలాండ్‌లోని ‘చియాంగ్‌ మై నైట్‌ సఫారి’లో ఉన్న ఒక అరుదైన పులి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం అవుతోంది. దాని అందమైన రూపాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ‘అవా’ అనే మూడేళ్ళ ఈ బంగారు వర్ణం పులిని అందరూ ‘స్ట్రాబెర్రీ టైగర్‌’ అని ముద్దుగా పిలుస్తున్నారు. పులులు సాధారణంగా నారింజ, నలుపు గీతల్లో ఉంటాయి. ఇది అలా లేదు. తన క్యూట్‌ లుక్‌ తో సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయింది. చాలా మంది అవాను తమ జీవితంలో చూసిన అత్యంత అందమైన జంతువుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

అవా ఫిబ్రవరి 16, 2021న తన సోదరి లూనాతో కలిసి జన్మించింది. అవా తల్లిదండ్రులను కొన్ని సంవత్సరాల క్రితం వేర్వేరు దేశాల నుండి ఈ సఫారి పార్క్‌కు తీసుకువచ్చారు. వాటి జన్యు నిర్మాణం (జెనెటిక్‌ మేకప్‌) అవాకు వచ్చిన ప్రత్యేకమైన గోల్డెన్‌ రంగుకు కారణంగా భావిస్తున్నారు.  నిపుణుల ప్రకారం, గోల్డెన్‌ పులులు వైట్‌ టైగర్ల కంటే కూడా అరుదైనవి.

చియాంగ్‌ మై నైట్‌ సఫారి సందర్శించిన వారు సోషల్‌ మీడియాలో అవాను చాలా ఆటపాటలతో ఉండే, స్నేహపూర్వక పులిగా వర్ణించారు. దాని మృదువైన రూపం వల్ల పర్యాటకులకు దాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరు ఈ పులిని చూసి ‘‘ఇది పులి కంటే ఒక పెంపుడు పిల్లిలా కనిపిస్తోంది’’ అని సరదాగా అన్నారు. మరికొందరు ఇంత అందమైన పులి నిజంగా ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement