వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్‌ | Amazon Business Rs 2000 Crore Benefits for Indian Enterprises | Sakshi
Sakshi News home page

వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్‌

Mar 22 2026 7:30 AM | Updated on Mar 22 2026 12:54 PM

Amazon Business Rs 2000 Crore Benefits for Indian Enterprises

బెంగళూరు: దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ ప్లాట్‌ఫాం ద్వారా గతేడాది రూ. 2,000 కోట్ల మేర ప్రయోజనాలు పొందేందుకు దోహదపడినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బిజినెస్‌ వెల్లడించింది. క్యాష్‌బ్యాక్‌ రివార్డులు, బల్క్‌ డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్‌ రూపంలో అత్యంత చిన్న వ్యాపారాల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు వివిధ సంస్థలు లబ్ధి పొందినట్లు వివరించింది.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌పై అదనంగా 5 శాతం మేర, ఆఫీస్‌లకు అవసరమయ్యే ఉత్పత్తులపై 30 శాతం వరకు బల్క్‌ డిస్కౌంట్లు ఉంటున్నాయని పేర్కొంది. పారదర్శకత కారణంగా అమెజాన్‌ బిజినెస్‌ ద్వారా ప్రొక్యూర్‌మెంట్‌ గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. సూరత్, లూధియానా, కొచ్చి తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా ఉందని సంస్థ వివరించింది. తమ కస్టమర్‌ బేస్‌లో ఇలాంటి నగరాల్లోని వ్యాపారాల వాటా ప్రస్తుతం 70 శాతానికి చేరినట్లు అమెజాన్‌ బిజినెస్‌ వివరించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement