మండే ఎండలు : నీళ్లు నమలండి! | Hot summer water rich fruits and vegetable help you stay hydrated | Sakshi
Sakshi News home page

మండే ఎండలు : నీళ్లు నమలండి!

Mar 28 2026 5:25 PM | Updated on Mar 28 2026 8:12 PM

Hot summer water rich fruits and vegetable help you stay hydrated

 Hot Summer రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయితే, కేవలం నీటి రూపంలోనే కాకుండా, మనం తినే ఆహారం ద్వారా కూడా శరీరానికి అవసరమైన తేమను అందించవచ్చు. దీన్నే నీటిని తినండి (ఈట్‌ యువర్‌ వాటర్‌) అని అంటుంటారు. 

ముఖ్యంగా వేసవి కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

  • దోసకాయలో 97శాతం నీరు ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 
  • సలాడ్లలో ఎక్కువగా వాడే లెట్యూస్‌ శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో 95% నీరుంటుంది
  • టమాటాల్లో 94% నీటితో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. 
  • పుచ్చకాయలో 92% నీరుంటుంది. ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌– ఇ లు సమృద్ధిగా ఉంటాయి. 
  • స్ట్రాబెర్రీలు రుచికరంగా ఉండటమే కాకుండా, 90% నీటిని కలిగి, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌– ఇ ని కలిగి ఉంటాయి. 
  • పియర్స్‌లో 83% నీరు ఉంటుంది. వీటిల్లో ఫైబర్, నీరు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
  • అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటమే కాకుండా, తగినంత నీటి శాతం (73%) కూడా ఉంటుంది. 

ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

కేవలం దాహం వేసినప్పుడే నీరు తాగడం కాకుండా, ఈ పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా, ఉత్సాహంగా ఉంటుంది.

ఇదీ చదవండి: గ్రేట్‌ ప్లాన్‌ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు


 

Advertisement
 
Advertisement
Advertisement