హైదరాబాద్ : తారలు దిగివచ్చిన వేళ.. మల్లెలు నడిచొచి్చన వేళ.. చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి.. ప్రేమాభిషేకం చిత్రంలోని ఈ పాట అందరికీ సుపరిచితమే.. ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, తారలు మద్దుతునిచ్చి ర్యాంప్ వాక్ చేశారు.
ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో నటి, సామాజిక సేవకురాలు లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథులుగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, సీనియర్‌నటులు సుహాసిని, జయప్రద పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష్మీ మంచు, సీరత్ కపూర్, అక్షర గౌడ, పాయల్ రాజ్‌పుత్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, ఫరియా అబ్దుల్లా, మాని్వత కామత్, తేజు అశ్విని, రాశి సింగ్, శివాని నాగారం, రితికా నాయక్, దక్ష నగర్కర్, అభిజ్ఞ వుత్తలూరు, శివ కందుకూరి, అరవింద్ కృష్ణ, ప్రిన్స్, విరాజ్ అశ్విన్, రోషన్ కె, నందు, ప్రియదర్శి పులికొండ తదితరుల ర్యాంప్ వాక్‌తో వాహ్ అనిపించారు.


