Yoga ప్రశాంతత కావాలంటే.. ఈ ఆసనం! | How to do Shashankasana Yoga and its Benefits | Sakshi
Sakshi News home page

Yoga ప్రశాంతత కావాలంటే.. ఈ ఆసనం!

Mar 28 2026 5:41 PM | Updated on Mar 28 2026 6:03 PM

How to do Shashankasana Yoga and its Benefits

Shashankasana (Pose of the Moon) యోగాలో చాలా ప్రశాంతతను కలిగించే ఆసనం.‘‘శశాంక’’ అనే సంస్కృత పదానికి చంద్రుడు అని అర్థం. చంద్రుడు శాంతి, చల్లదనం, సమతుల్యతకు ప్రతీక. ఈ ఆసనం కూడా మన శరీరం, మనసుకు అలాంటి శాంతిని ఇస్తుంది. ఈ ఆసనం ప్రత్యేకంగా మెదడు, నాడీవ్యవస్థ, వెన్నెముకకు చాలా ఉపయోగకరం. ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గించడంలో ఇది మంచి యోగాసనం.

శశాంకాసనం చేసే విధానం.. 
స్టెప్‌ 1... ముందుగా నేలపై యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చోవాలి. (మోకాళ్లు మడిచి, ΄ాదాలపై కూర్చోవాలి.) స్టెప్‌ 2... వెన్నెముకను సూటిగా ఉంచి, చేతులను మోకాళ్ళపై ఉంచాలి. స్టెప్‌ 3... నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని ముందుకు వంచాలి. స్టెప్‌ 4... చేతులను ముందుకు చాపి, నుదుటిని నేలకు తాకేలా వంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్లీ నెమ్మదిగా పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి. ఇదే విధంగా 3 నుంచి 5 సార్లు సాధన చేయాలి.

ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

జాగ్రత్తలు..
మోకాళ్ల నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. వెన్నెముకకు తీవ్రమైన సమస్యలు ఉన్నవారు యోగా గురువు సలహాతో చేయాలి. హై బీపీ లేదా తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువసేపు వంగి ఉండకూడదు. ఆసనం వేస్తూ శ్వాసను బలవంతంగా ఆపకూడదు. ఖాళీ కడుపుతో చేయడం మంచిది. శశాంకాసనాన్ని  ప్రాణాయామం లేదా ధ్యానం ముందు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది.
-పాతర్ల అనిత, యోగా ట్రైనర్‌

ఇదీ చదవడి: గ్రేట్‌ ప్లాన్‌ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement