breaking news
calm
-
కొన్ని సందర్భాల్లో.. మౌనమే సమాధానం!
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్‌లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు..ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్‌కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.ముందే పరిష్కారం దొరికినప్పుడు..మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్‌గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ, అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.విషయం తెలియనప్పుడు..మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.రుజువు చేసుకోలేనప్పుడు...మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.అవతలివారిని బాధపెట్టే సందర్భంలో...మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.మనసు బాగోలేనప్పుడు...అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది. -
Yoga ప్రశాంతత కావాలంటే.. ఈ ఆసనం!
Shashankasana (Pose of the Moon) యోగాలో చాలా ప్రశాంతతను కలిగించే ఆసనం.‘‘శశాంక’’ అనే సంస్కృత పదానికి చంద్రుడు అని అర్థం. చంద్రుడు శాంతి, చల్లదనం, సమతుల్యతకు ప్రతీక. ఈ ఆసనం కూడా మన శరీరం, మనసుకు అలాంటి శాంతిని ఇస్తుంది. ఈ ఆసనం ప్రత్యేకంగా మెదడు, నాడీవ్యవస్థ, వెన్నెముకకు చాలా ఉపయోగకరం. ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గించడంలో ఇది మంచి యోగాసనం.శశాంకాసనం చేసే విధానం.. స్టెప్ 1... ముందుగా నేలపై యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చోవాలి. (మోకాళ్లు మడిచి, ΄ాదాలపై కూర్చోవాలి.) స్టెప్ 2... వెన్నెముకను సూటిగా ఉంచి, చేతులను మోకాళ్ళపై ఉంచాలి. స్టెప్ 3... నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని ముందుకు వంచాలి. స్టెప్ 4... చేతులను ముందుకు చాపి, నుదుటిని నేలకు తాకేలా వంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్లీ నెమ్మదిగా పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి. ఇదే విధంగా 3 నుంచి 5 సార్లు సాధన చేయాలి.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవుజాగ్రత్తలు..మోకాళ్ల నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. వెన్నెముకకు తీవ్రమైన సమస్యలు ఉన్నవారు యోగా గురువు సలహాతో చేయాలి. హై బీపీ లేదా తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువసేపు వంగి ఉండకూడదు. ఆసనం వేస్తూ శ్వాసను బలవంతంగా ఆపకూడదు. ఖాళీ కడుపుతో చేయడం మంచిది. శశాంకాసనాన్ని ప్రాణాయామం లేదా ధ్యానం ముందు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది.-పాతర్ల అనిత, యోగా ట్రైనర్ఇదీ చదవడి: గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు -
అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు!
నిర్మలమైన హృదయం కలిగి ఉండి, మత్సరభావం లేకుండా, ప్రశాంత చిత్తంతో ఎల్లవేళలా సృష్టిలోని సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటూ, ఇతరులతో సంభాషణల సమయంలో ప్రియంగా మాట్లాడేవారి హృదయాలలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడని విజ్ఞులు చెబుతారు. ‘కావాలని మనస్సులోని ఆలోచనలను పాపకర్మలు చేయడం వైపుకు మరల నీయకుండా, చెడ్డ పనులను తలపెట్టక, ధర్మమార్గాన్ని ఎన్నడూ విడిచి పక్కదోవ పట్టకుండా చూసుకుంటూ, చెడ్డపేరు తెచ్చిపెట్టే పనుల జోలికి వెళ్ళకుండా, ఇరుగుపొరుగున అందరూ తమను మెచ్చుకునే పద్ధతిలో జీవనం సాగించే వ్యక్తులు దేవతలతో సమానమైనవారే అవుతారని, వారిలో ఇంకేమి తక్కువని అలా అనకుండా ఉండగలం?’ అని వెన్నెలకంటి సూరన రచనయైన ‘ఆంధ్ర శ్రీ విష్ణుపురాణము’ ప్రశ్నించి చెప్పింది. పుణ్యానికైనా, పాపానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి, ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం మనిషికి అవసరం అన్నది పై మాటల సారాంశంగా భావించవచ్చు. సరిగా ఈ ఆలోచననే నొక్కి చెప్పినట్లుగా, బుద్ధిలో సందేహము, నిర్మలత్వము లేకుండా ఆచరించబడే కర్మల నిష్ప్రయోజకత్వాన్ని ఎఱయకవి రచించిన ‘సకలనీతికథా నిదానము’ ప్రథమాశ్వాసములోని ఈ కింది తేటగీతి పద్యం తేలికైన మాటలలో చెప్పింది.చిత్తశుద్ధి లేక చేసిన జపమునుతపము హోమవిధియు దానములునుదేవతార్చనములు భావింప నిష్ఫలమట్లుగాన వలయు నాత్మ శుద్ధి. మనసు నిర్మలంగా ఉండడం, చేసే పనియందు లగ్నమై ఉండడం – కార్యాచరణలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఏకాగ్రచిత్తంతో చేయని ఏ పని కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మనసులో నిర్మలత్వం లేని దానము, దేవతార్చన కూడా నిష్ఫలమే అవుతాయి. అందువలన మనసును – అంటే ఆత్మను, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అని పై పద్యం సారాంశం. సువాసనలు వెదజల్లే పూవులను పూచే మొక్కలకు, రుచికరమైన పండ్లను ఫలించే చెట్లకు, మూలాలు భూమి పొరలలోని మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఇహపరాలలో మనిషికి ఆధ్యాత్మిక సౌఖ్యాలను అందించే పుణ్యానికి మూలాలు నిర్మలమైన చిత్తంతో ఈ భువిపై జీవనంలో ఆచరించే సత్కర్మలలోనే ఉంటాయన్నది కాదనలేని నిజం.– భట్టు వెంకటరావు -
ప్రశాంతంగా శబరిమల.. తక్కువగా రద్దీ
సన్నిధానం: కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆదివారం ఆందోళనలు నిర్వహించినప్పటికీ శబరిమల ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మాట్లాడుతూ భక్తుల యాత్రకు అనవసర అడ్డంకులు కల్పించొద్దనీ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. కాగా, రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు అమలు కు మరికొంత సమయం కావాలని కోరుతూ సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పద్మకుమార్ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. -
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది
-
'అందులో విదేశీ హస్తం ఉంది.. బయటపెడతాం'
న్యూఢిల్లీ: పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా సిక్కు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆందోళనలు నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని కేంద్రమంత్రి అకాలీ దళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. త్వరలోనే వారి వివరాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ ఫరీద్ కోట్లో ఓ సిక్కు వర్గం నిరసన ర్యాలీకి బయలుదేరగా.. వారిని మరో వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లతోపాటు, పదునైన ఆయుధాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కూడా జోక్యం చేసుకోగా వారిని తీవ్రంగా గాయపరిచారు. దీని అనంతరం పంజాబ్‌లో పలు సున్నిత ప్రాంతాల్లో ఈ ఘర్షణలు వాయువేగంతో వ్యాపించి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం కూడా అక్కడ ఇంకా అలాంటి పరిస్దితులే ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందించిన తర్వాత కేంద్ర నుంచి తొలిసారి ఓ కేంద్రమంత్రి స్పందించి సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఘర్షణల వెనుక విదేశీ హస్తం ఉందన్నారు. అన్ని వర్గాలు దయచేసి శాంతి సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.


