Parenting పిల్లలు చిన్నప్పటినుంచి ధైర్యంగా ఉంటేనే పెద్దయ్యాక వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనగలిగే సత్తా వస్తుంది. సరైన మార్గదర్శకత్వం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం.
ముందుగా చేయాల్సింది... పిల్లలకు చిన్నప్పటినుంచి అన్నం తినకపోతే బూచాడొచ్చి పట్టుకుపోతాడని బోదిరించడం మానెయ్యాలి. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను సైతం మనం గుర్తించి అభినందించాలి. అలాగే వారు చేసిన తప్పులను విమర్శించకుండా వాటి నుండి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉందని వారికి అర్థమయ్యేలా విడమరచి చెప్పాలి.
అలాగని పిల్లలు ఏం చేసినా ΄÷గడాలని లేదా వారు ఏం చెప్పినా అంగీకరించాలని కాదు. నిపుణులు సూచించిన కొన్ని మార్గాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించవచ్చు.
పిల్లలు చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తారు. అందుకే ఇంట్లో సానుకూలమైన వాతావరణం కల్పించాలి. ప్రేమతో... అభిమానంతో పెంచితే వారి ఆత్మవిశ్వాసం మెల్లగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పెరిగిన పిల్లలకి భయాలు తక్కువగా ఉంటాయి.
పిల్లవాడు ఏదైనా సాధించినప్పుడు అది చిన్న విజయమే అయినా గమనించాలి. నిజాయితీతో పొగడాలి. అలాంటి ప్రశంసలు పిల్లలకు కృషి పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. వారికిచ్చే ప్రశంసలే వారికి టానిక్‌లా పని చేసి మంచి దిశగా నడిపిస్తాయి.
తప్పులు చేయడం సహజమని, ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేస్తారని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. ఈ మాటలు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తాయి.
స్వయంగా చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకి ఏ వస్త్రాలు వేసుకోవాలి..? ఏ ఆట ఆడాలి వంటి చిన్న విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు పిల్లలు తమపై నమ్మకం పెంచుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.
పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. రోజూ లాగా లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే... ఏదో జరిగినట్లే. అది మీకు చెప్పాలంటే వారితో మీరు సుతిమెత్తగా మాట్లాడుతూ... దగ్గరకు తీసుకొని... అడగాల్సి ఉంటుంది. వాళ్లు ఏదైనా తప్పు చేస్తే... మీరు దాన్ని సున్నితంగా మందలిస్తూ సరిదిద్దాలే తప్ప... కోపం తెచ్చుకొని కొట్టినా, తిట్టినా వాళ్లలో భయం మరింత పెరిగి... అది మానసికంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
పిల్లలు ఏడుస్తున్నప్పుడో, బాధ పడుతున్నప్పుడో మీరు పక్కనే ఉండి వారు చెప్పేది సహనంతో వినండి.. వారు తమ ఇబ్బందిని ధైర్యంగా చెప్పుకునేలా చెయ్యండి. దాంతో వారిలో భారం దిగి΄ోయి మీరు వారికి రక్షణగా ఉన్నారనే భావనతో ధైర్యం వస్తుంది.
పిల్లలు ప్రతీదీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా పేరెంట్స్ ధైర్యంగా ఉంటేనే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. అలాగే పిల్లల ముందు ఇతరులను గట్టి గట్టిగా అరవడం, తిట్టడం మంచిది కాదు. అది అది చూసి పిల్లలు భయపడతారు. భయం వారిలో చురుకుదనాన్ని పోగొట్టి... మానసికంగా చాలా ఇబ్బందులు తెస్తుంది.
ఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్
చాలా మానసిక సమస్యల్లో తల్లిదండ్రులు వారికి సరిగా అండగా నిలవక΄ోవడం వల్లే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలకు అవసరమైన సమయంలో మీ సాయం అందాలి. మీరు ఎంత చెప్పినా వారిలో ధైర్యం పెరగకపోతే... కౌన్సెలింగ్ ఇప్పించాలి.
వారి ప్రతి కదలికలో మీ అండదండలు ఉంటే... ఓ మంచి సిటిజన్‌ను మీరు ఈ ప్రపంచానికి ఇచ్చినట్లు అవుతుంది. పిల్లల దృష్టిలో కూడా మీరు మంచి పేరెంట్స్‌గా నిలుస్తారు.
ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు


