సిల్వర్‌ హిట్‌.. బంగారం ధగధగలు | Silver Soars Gold Glows Precious Metals Witness Massive Single Day Rally | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ హిట్‌.. బంగారం ధగధగలు

Mar 26 2026 6:59 AM | Updated on Mar 26 2026 7:01 AM

Silver Soars Gold Glows Precious Metals Witness Massive Single Day Rally

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.

భౌగోళిక రాజకీయ సెంటిమెంట్‌ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్‌ వెండి ఔన్స్‌కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement