చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..? | Chiranjeevi and Bobby Kolli movie will be start this schedule | Sakshi
Sakshi News home page

చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?

Mar 29 2026 7:06 AM | Updated on Mar 29 2026 7:06 AM

Chiranjeevi and Bobby Kolli movie will be start this schedule

‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ రెడీ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

చిరంజీవి- బాబీ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ మూడో వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. భారీ యాక్షన్‌ కాన్సెప్ట్‌ కథతో బాబీ సిద్ధం అయ్యారట. ఈ చిత్రంలో ఫుల్‌ మాస్‌ రోల్‌లో చిరంజీవి కనిపించనున్నారని టాక్‌. అయితే, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. చిరు సరసన భార్యగా ప్రియమణి, కూతురి పాత్రలో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ దాదాపుగా ఫిక్స్‌ అయినట్లు టాక్‌ ఉంది. ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ విడుదల గురించి ప్రకటన రాలేదు. 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఎప్పుడు థియేటర్‌లోకి వస్తుందో అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement