దురంధర్‌-2 కలెక్షన్స్.. తొలి వారం ఎన్ని కోట్లంటే? | Ranveer singh Dhurandhar 2 collections In first week | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 collections: తొలివారం కలెక్షన్స్.. ఆ విషయంలో మొదటి సినిమాగా రికార్డ్

Mar 27 2026 2:44 PM | Updated on Mar 27 2026 3:09 PM

Ranveer singh Dhurandhar 2 collections In first week

రణ్‌వీర్‌ సింగ్‌- ఆదిత్యధర్‌ కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ధురంధర్‌ ది రివెంజ్. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ను రిలీజ్ చేయడం విశేషం. తొలి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది.

తాజాగా ఈ మూవీ మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఓవరాల్‌గా చూస్తే ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్‌ రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో రూ.274 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నెట్‌ పరంగా చూస్తే రూ.690 కోట్లు వసూలు చేసింది. 

ఈ మూవీలో సంజయ్‌ దత్‌, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్‌ హీరోయిన్‌గా మెప్పించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీపై దక్షిణాది స్టార్స్ ప్రశంసలు కురిపించారు.  
 

 

Advertisement
 
Advertisement
Advertisement