స్టార్‌ దర్శకులను మెప్పించిన సినిమా.. ట్రైలర్‌ చూశారా? | Neelira movie Official Trailer out now | Sakshi
Sakshi News home page

వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్‌ను మెప్పించిన సినిమా.. ట్రైలర్‌ చూశారా?

Mar 29 2026 9:07 AM | Updated on Mar 29 2026 9:07 AM

Neelira movie Official Trailer out now

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నీలిర'.. తమిళ్‌ వర్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు వర్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 1988నాటి శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. అప్పటి భయానక పరిస్థితుల మధ్య సామాన్యుల ఇబ్బందులు కళ్లకు కట్టేలా ఈ మూవీలో చూపించనున్నారు.

నీలిర చిత్రాన్ని ఇప్పటికే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ వంటి క్రియేటివ్ దర్శకులు చూశారు. ఈ మూవీ కథ, తెరకెక్కించిన తీరుపై వారు ప్రశంసలు కురిపించారు. యుద్ధం వెనుక దాగి ఉన్న సామాన్యుల కన్నీటి గాథలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాజాగా ట్రైలర్‌ను చూస్తే దర్శకుడు సోమీధరన్ ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత సహజంగా, డాక్యుమెంటరీ స్టైల్  తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

శ్రీలంకలో అంతర్యుద్ధం
1988లో శ్రీలంకలో జరిగిన  కొన్ని సంఘటనలు రాజకీయ మార్పులకు దారితీశాయి. ప్రేమదాసా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో శ్రీలంకలో సివిల్ వార్ మరింత తీవ్రతరం కావడానికి కారణమైంది. శ్రీలంకలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ అయిన జనతా విముక్తి పెరమున (JVP) తిరుగుబాటు వల్ల దక్షిణ ప్రాంతంలో అలజడి రేగింది. దీంతో ప్రజలపై హింసాత్మక దాడులు జరిగాయి. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలు అయింది. ఆపై ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో LTTE (Liberation Tigers of Tamil Eelam) తిరుగుబాటు కొనసాగింది. ఈ రెండు తిరుగుబాట్ల కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు మరణించారు. ఎంతోమందిపై హింసాత్మక దాడులు జరిగాయి. దీంతో అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. తర్వాత దేశంలో పరిపాలన మార్పులు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement