ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..! | Khushbu Sundar reacts to Ravi Mohan Idly actress remark | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!

May 18 2026 12:34 PM | Updated on May 18 2026 12:49 PM

Khushbu Sundar reacts to Ravi Mohan Idly actress remark

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.  పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్‌ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.

తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ ‍అయింది. 

తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement