భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. త్వరలోనే 'టాక్సిక్'తో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురి భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ.. కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఆమె (సరయూ) పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూలేం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలు.. అన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచే నేర్చుకుంటారు' అని కియారా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
కియారా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది పూర్తి కాని కూతురి గురించి మాట్లాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. కియారా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్లకు కూతురు పుట్టింది.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు మన దేశంలో ఓటీటీకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన)
#KiaraAdvani Bold STATEMENT about her Daughter left Everyone SHOCKED 😳
She Said , - I will let My Daughter to DATE as many MAN she Wants . No Need to Marry a Guy You Date . EXPLORE Yourself with them .
Earlier #RamKapoor Wife Giving SE*X and VIB*R*A*T*OR to her Daughter as… pic.twitter.com/uMqeOgxFOm— Manoz Kumar (@ManozTalks) May 15, 2026


