'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)
గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్‌వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)
Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥
Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026


