విషాదం.. గుండెపోటుతో 47 ఏళ్ల నటుడు మృతి! | Kannada Actor Dileep Raj Dies Of Heart Attack | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి!

May 13 2026 11:16 AM | Updated on May 13 2026 11:45 AM

Kannada Actor Dileep Raj Dies Of Heart Attack

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్‌ రాజ్‌(47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం తన ఇంట్లో దిలీప్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధ్రువీకరించారు. దిలీప్‌ మరణవార్త కన్నడ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

2007లో పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన మిలానా చిత్రంలో దిలీప్‌కి మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘యు-టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. వెండితెరపైనే కాదు.. హిట్లర్‌ కళ్యాణ వంటి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా రాణించారు. డీఆర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టీవీ సీరియళ్లను నిర్మించారు. ఆయన అకాల మృతితో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement