కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తోన్న చిత్రం కేడీ ది డెవిల్. ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేడీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలోనే ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో శిల్పా శెట్టి, సంజయ్ దత్ పాత్రలు హైలెట్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఇది అంతం కాదు.. ఆరంభం అనే డైలాగ్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది.
ఇటీవల ఈ మూవీలో ఓ సాంగ్ హిందీ వర్షన్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. లిరిక్స్ విషయంలో బూతుపదాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. దీంతో ఈ సినిమాలోని ఆ పాటను అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ తొలగించారు. మరి ఈ సాంగ్ తెలుగు వర్షన్ ఉంటుందో.. లేదో సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. కాగా.. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు.


