భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ | Suraj Nambiar Reacts Divorce Alimony And Disha Involvement | Sakshi
Sakshi News home page

Suraj Nambiar: లెక్కలేనన్ని రూమర్స్.. హీరోయిన్ మాజీ భర్త క్లారిటీ

May 18 2026 7:21 PM | Updated on May 18 2026 8:05 PM

Suraj Nambiar Reacts Divorce Alimony And Disha Involvement

బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.

ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.

(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement