'అందుకే స్టాలిన్‌ను కలిశా.. విజయ్‌పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ | Kollywood Super Star Rajinikanth Comments On Tamil Nadu Politics | Sakshi
Sakshi News home page

Rajinikanth: 'అతను సీఎం అయ్యింటే అసూయ పడేవాడిని'

May 17 2026 11:12 AM | Updated on May 17 2026 12:18 PM

Kollywood Super Star Rajinikanth Comments On Tamil Nadu Politics

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.

కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్‌ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్‌ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్‌ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్‌ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి ‍అసూయ లేదన్నారు. కమల్‌హాసన్‌ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్‌ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్‌కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్‌తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement