సాహిత్యం ఒక థెరపీ.. తెలుగు సినిమాల్లో పాడాలనుంది | Sanjeeta Bhattacharya Hyderabad Tour Latest | Sakshi
Sakshi News home page

Sanjeeta: హైదరాబాద్‌ అంటే ప్రేమ, సంస్కృతి, బిర్యానీ

May 17 2026 8:40 PM | Updated on May 17 2026 9:08 PM

Sanjeeta Bhattacharya Hyderabad Tour Latest

ఏది మనసును ఇబ్బంది పెడితే, దాన్ని కాగితంపై రాయండి. రాయడం అనేది ఒక ఆటోమేటిక్ రిలీజ్, అదొక థెరపీ కూడా.. అంటూ బ్రేకప్‌ టిప్స్  పంచుకుంది ప్రముఖ బాలివుడ్‌ సింగర్‌ కం యాక్టర్‌ సంజీతా భట్టాచార్య. మొదట్లో అలా రాసిన పాటను పాడేటప్పుడు గొంతు ఆగిపోతుందని, భావోద్వేగాలు అడ్డొస్తాయని.. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి కన్నా పాటే మిగిలిందని, అదే సంగీతంలోని అందమని ఆమె తెలిపారు. “మనిషి వెళ్లిపోతాడు… కానీ పాట మాత్రం ఉండిపోతుంది” అనే తన మాటలతో ఈ జనరేషన్‌లో బ్రేకప్‌లను బలహీనతగా కాకుండా, భావాలను అర్థం చేసుకునే ఒక దశగా చూడాలని సంజీతా సూచించారు. బాధను దాచుకోకుండా, దాన్ని ఆర్ట్‌గా, పాటగా, రాతగా మార్చితే అదే మన శక్తిగా మారుతుందన్నారు.

షారుఖ్‌ కోసం స్పానిష్‌ సాంగ్‌..
నగరంలోని ఇనార్బిట్‌ మాల్‌ లో షాపర్ష స్టాప్‌, హైబ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలోని ఫస్ట్‌ గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌ ఆడిషన్స్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీతా భట్టాచార్య ‘సాక్షి’తో ముచ్చటించారు. గ్లామరస్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక బెర్క్లీ కళాశాలలో మ్యూజిక్ డిగ్రీ పొందిన సంజీతా భట్టాచార్య.. సంగీతమే తనకు మొదటి ప్రేమ అని తెలిపింది. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాలో తాను నటించడంతో పాటు స్పానిష్‌ సాంగ్‌ పాడటం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. షారుక్‌ అంటే తనకూ ఎంతో ఇష్టమని, షూటింగ్‌ సమయంలో అలా చూస్తూ ఉండిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

‘‘మా నాన్న నాకు మొదటి ప్రేరణ.. తానొక పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌, ఆర్టిస్ట్‌గా సృజనాత్మకతతో జీవిస్తూ అందులోని ప్రేమను ఆస్వాదిస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్, క్రిస్టినా, సెలిన్ డియాన్‌తో పాటు ఏ.ఆర్‌.రహ్మాన్ తన ఫేవరెట్స్‌ అని చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్‌ కొత్త ఆల్బమ్‌ బీటీఎస్‌ అరిరంగ్‌ అందుబాటులో ఉందని, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రానుననాని, ఈ సంవత్సరం విడుదలకానున్న అల్బమ్ లో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ పాటలు ఉంటాయని అన్నారు.

మ్యూజిక్, కల్చర్, ఇన్‌స్పిరేషన్..
హైదరాబాద్‌ ప్రజలు, ఇక్కడి సంస్కృతి ముఖ్యంగా బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడికి 5 సార్లు వచ్చాను.. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడి నుంచి కొత్త ఫ్రెండ్స్‌తో వెళుతున్నాను.. అని హైదరాబాద్‌ ఆత్మీయ విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కూడా పాడాలని ఉంది.. ఆ కోరిక త్వరలో నిజం కావాలని ఆశించారు. ఈ సందర్భంగా అభిమానుల కే-పాప్‌ సాంగ్‌ కావాలనే కోరిక మేరకు.. స్మూత్‌ లైక్‌ బెటర్‌ బీటీఎస్‌ సాంగ్‌ పాడి అలరించారు. ఈ తరం అమ్మాయిలు సోషల్‌ మీడియా వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్‌ లైఫ్‌స్టైల్‌, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫోటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement