అయోధ్యలో భూమి కొన్న రణబీర్ కపూర్: ధర ఎంతంటే? | Ranbir Kapoor Buys Land Worth Rs 3 31 Crore In Ayodhya | Sakshi
Sakshi News home page

అయోధ్యలో భూమి కొన్న రణబీర్ కపూర్: ధర ఎంతంటే?

May 14 2026 8:22 PM | Updated on May 14 2026 8:29 PM

Ranbir Kapoor Buys Land Worth Rs 3 31 Crore In Ayodhya

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అయోధ్యలోని హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) వారి ప్రీమియం ప్లాటెడ్ డెవలప్‌మెంట్‌లో ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది.

సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ''ది సరయూ'' అనే ప్రీమియం ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ భూమిని కొనుగోలు చేశారు. సుమారు 2,134 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ స్థలం విలువ దాదాపు రూ.3.31 కోట్లు. ఇందులో క్లబ్ హౌస్, విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. ది లీల నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉంది.

భూమిని కొనుగోలు చేసిన సందర్భంగా.. ''అయోధ్య నన్ను పిలిచినట్టుగా అనిపించింది, నేను ఆ పిలుపుకు స్పందించాను'' అని రణబీర్ కపూర్ పేర్కొన్నారు. కాగా.. ఈయన త్వరలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అందువల్లనే అయోధ్యతో తనకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.

భారతదేశ చరిత్రలో..  సంస్కృతిలో అయోధ్యకు ఉన్న ప్రత్యేక స్థానం కారణంగా, ఈ భూమిని తన కుటుంబ వారసత్వంలో భాగంగా ఉంచాలని భావించినట్లు రణబీర్ కపూర్ చెప్పారు.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement