కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్ | Suriya fans protest in Puducherry as Karuppu release last minute delay | Sakshi
Sakshi News home page

Karuppu Release: కరుప్పు వాయిదా.. రోడ్డుపై ఫ్యాన్స్ ఆందోళన

May 14 2026 6:31 PM | Updated on May 14 2026 6:37 PM

Suriya fans protest in Puducherry as Karuppu release last minute delay

తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్‌ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో  యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement