సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు | Tamilnadu CM Vijay fell on Karur victim feet goes viral | Sakshi
Sakshi News home page

Vijay: సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు

May 15 2026 3:03 PM | Updated on May 15 2026 3:48 PM

Tamilnadu CM Vijay fell on Karur victim feet goes viral

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.

విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.

ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు.  ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు.  ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు.  గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement