కాన్స్‌లో సందడి | Alia Bhatt in Cannes Film Festival | Sakshi
Sakshi News home page

కాన్స్‌లో సందడి

May 13 2026 1:18 AM | Updated on May 13 2026 1:18 AM

Alia Bhatt in Cannes Film Festival

‘ఎంట్రీ సూపర్‌... ప్రిన్సెస్‌లా ఉంది’ అంటూ ప్రస్తుతం కాన్స్‌ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్న ఆలియా భట్‌ని ఉద్దేశించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని కాన్స్‌ నగరంలో 79వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 23 వరకూ జరుగుతుంది. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు ఐశ్వర్యా రాయ్, ఆలియా భట్, తారా సుతారియా తదితరులు పాల్గొననున్నారు.

ఇప్పటికే ఆలియా ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె ఇందులో భాగంగానే అక్కడికి వెళ్లారు. తొలి రోజు రెడ్‌ కార్పెట్‌పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్‌ రివెరా దగ్గర దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫ్లోరల్‌ ప్రింట్‌ ఫ్రాక్‌లో ఆమె మెరిసిపోయారు. ఇలా తొలి రోజే ఫొటోషూట్‌తో ఆకట్టుకున్న ఆలియా... మరి రెడ్‌ కార్పెట్‌పై ఏ స్థాయిలో సందడి చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement