భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్‌ | Sivakarthikeyan New Music Album Velum Mayilum | Sakshi
Sakshi News home page

మ్యూజికల్‌ రంగంలోకి శివకార్తికేయన్‌

May 17 2026 8:43 AM | Updated on May 17 2026 10:22 AM

Sivakarthikeyan New Music Album Velum Mayilum

తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్‌ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్‌కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. 

ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్‌ మయిలుమ్‌ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్‌ అందించారు. ఈ ప్రైవేట్‌ మ్యూజికల్‌కు నివాస్‌ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్‌ కిళవి ఫేమ్‌ శివకుమార్‌ మురుగేశన్‌ డైరెక్ట్‌ చేశాడు. ఇలాంటి ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్‌.. మురుగేశన్‌ దర్శకత్వంలో 'సెయోన్‌' చిత్రంలో నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement