సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు? | Who Is The Next Kollywood Thalapathy after Vijay as a Chief Minister | Sakshi
Sakshi News home page

Vijay: సీఎంగా విజయ్.. మరి నెక్ట్స్ దళపతి అతనేనా?

May 12 2026 5:04 PM | Updated on May 12 2026 5:40 PM

Who Is The Next Kollywood Thalapathy after Vijay as a Chief Minister

ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్‌ క్రియేట్‌ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు.  పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో కోలీవుడ్‌లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్‌ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్‌లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్‌డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

తదుపరి దళపతి ఎవరు?

విజయ్ తర్వాత కోలీవుడ్‌లో అంతే రేంజ్‌లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్‌ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్‌లో మాస్ ఇమేజ్‌ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్‌లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు ‍అవుతారో వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement