హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే? | Fahadh Faasil new movie launched at Chennai | Sakshi
Sakshi News home page

Fahadh Faasil: హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే?

May 18 2026 8:18 AM | Updated on May 18 2026 9:02 AM

Fahadh Faasil new movie launched at Chennai

మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్‌ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా, విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్‌ ఫాజిల్‌ తాజాగా తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మిస్తున్నారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్‌తో షూటింగ్‌కు రెడీ అవడం ఈయన విధానం. ఫాహద్‌ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ల రేర్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్‌ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చెన్నైలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, నటీనటులు ,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement