సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి! | Karuppu Movie Suriya, Trisha Krishnan And RJ Balaji Remuneration Details, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Veerabhadrudu: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో తెలుసా?

May 16 2026 9:31 AM | Updated on May 16 2026 9:53 AM

Karuppu Movie: Suriya, Trisha Krishnan, RJ Balaji Remuneration Details

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...

పారితోషికం
కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్‌ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్‌ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్‌ మరియన్‌కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!

తర్వాతి నుంచి..
ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌- రజనీకాంత్‌ మూవీలో యాక్ట్‌ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్‌ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!

చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement