breaking news
Veerabhadrudu Movie
-
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్‌కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
రెండేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్.. సూర్య కెరీర్లోనే అత్యధికం!
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడిగా విడుదలైంది). త్రిష హీరోయిన్గా నటించిన ఇందులో ఆర్జే.బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. న్యాయస్థానం, అవినీతికి పాల్పడే న్యాయవాదులు, న్యాయం కోసం బాధితులు పడే అవస్థలు, గ్రామ దేవతలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ రిలీజయ్యాక ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.సూర్య కెరీర్లోనే అత్యధికంమే 15న తెరపైకి వచ్చిన కరుప్పు చిత్రం వారం దాటినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. సూర్య శనివారం ఈ చిత్ర విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం అరగంట, ముప్పావు గంటలో తీసుకున్న నిర్ణయం ఈ చిత్రం. దర్శకుడు ఆర్జే.బాలాజీ విజన్యే ఈ సినిమా. ఇటీవలి కాలంలో జనం నుంచి ఇంత స్పందన చూడలేదు. రాజీ పడలేదుప్రతి చిత్రానికి ఏదో ఒక విమర్శ వస్తుంటుంది. అయితే ఈ చిత్రానికి అంతటా ప్రేమ మాత్రమే లభించడంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మాతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. పిల్లల నుంచి పెద్దలు వరకూ చూసి ఆనందించడంతో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటం ఆనందంగా ఉంది అన్నారు. #Karuppu MEGA BLOCKBUSTER 🔥🔥🔥🔥 @Suriya_offl ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/CeTOaOdawY— RJ Balaji (@RJ_Balaji) May 21, 2026 చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సూర్య వీరభద్రుడు
-
ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీమ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.అసలేం జరిగింది?సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.ఈ రోజు నుంచే మార్పు..ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. -
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్‌కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వీరభద్రుడునటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులునిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభురచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీసినిమాటోగ్రఫీ : జికె విష్ణుసంగీతం : సాయి అభ్యంకర్ఎడిటర్ : ఆర్.కళైవానన్విడుదల తేది: మే 15, 2026సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే..ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది. మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.


