రెండేళ్ల కిందటే గ్రీన్‌ సిగ్నల్‌.. సూర్య కెరీర్‌లోనే అత్యధికం! | Suriya: I Agreed to do Karuppu Movie 2 Years Back | Sakshi
Sakshi News home page

Suriya: అరగంటలో ఓకే చెప్పా.. ఇంత రెస్పాన్స్‌ ఈమధ్యకాలంలో చూడలేదు

May 24 2026 9:28 AM | Updated on May 24 2026 11:25 AM

Suriya: I Agreed to do Karuppu Movie 2 Years Back

సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడిగా విడుదలైంది). త్రిష హీరోయిన్‌గా నటించిన ఇందులో ఆర్‌జే.బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. న్యాయస్థానం, అవినీతికి పాల్పడే న్యాయవాదులు, న్యాయం కోసం బాధితులు పడే అవస్థలు, గ్రామ దేవతలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ రిలీజయ్యాక ఫస్ట్‌ షో నుంచే సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంది.

సూర్య కెరీర్‌లోనే అత్యధికం
మే 15న తెరపైకి వచ్చిన కరుప్పు చిత్రం వారం దాటినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. సూర్య శనివారం ఈ చిత్ర విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం అరగంట, ముప్పావు గంటలో తీసుకున్న నిర్ణయం ఈ చిత్రం. దర్శకుడు ఆర్‌జే.బాలాజీ విజన్‌యే ఈ సినిమా. ఇటీవలి కాలంలో జనం నుంచి ఇంత స్పందన చూడలేదు. 

రాజీ పడలేదు
ప్రతి చిత్రానికి ఏదో ఒక విమర్శ వస్తుంటుంది. అయితే ఈ చిత్రానికి అంతటా ప్రేమ మాత్రమే లభించడంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మాతలు ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌, ఎస్‌ఆర్‌.ప్రభు చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. పిల్లల నుంచి పెద్దలు వరకూ చూసి ఆనందించడంతో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు పడుతుండటం ఆనందంగా ఉంది అన్నారు.

 

 

చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement