క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌ | Ram Charan Apologises over Jasprit Bumrah Football Player Comment | Sakshi
Sakshi News home page

'బుమ్రా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌'.. క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌

May 24 2026 8:49 AM | Updated on May 24 2026 11:20 AM

Ram Charan Apologises over Jasprit Bumrah Football Player Comment

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 'పెద్ది' సినిమా రిలీజ్‌ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించగా, తాజాగా భోపాల్‌ లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌ నోరు జారడంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. దీంతో వెంటనే తన తప్పు సరిదిద్దుకుంటూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా క్షమాపణలు చెప్పాడు.

ఏం జరిగింది?
'పెద్ది కీ ఆవాజ్‌' పేరుతో భోపాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌, ఏఆర్‌ రెహమాన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న హోస్ట్‌ రామ్‌చరణ్‌తో ర్యాపిడ్‌ ఫైర్‌ ఆడించాడు. కొంతమంది క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలన్నాడు. అలా సచిన్‌, ధోని, కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి స్టార్‌ క్రికెటర్స్‌ గురించి ఒక్క లైన్‌లోనే పొగడ్తలు కురిపించాడు. చివరగా టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేరు ప్రస్తావించాడు యాంకర్‌.

వీడియో క్లిప్‌ వైరల్‌
ఇక్కడే చరణ్‌ తప్పులో కాలేశాడు. 'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం. ఆయన మనదేశంలో ఫుట్‌బాల్‌ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు' అని బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెటర్‌ను ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేర్కొనడంతో చరణ్‌ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు హోస్ట్‌ కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షమించండి
దీంతో చరణ్‌ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్షమాపణలు చెప్పాడు. 'కొన్నిసార్లు నేను పేర్ల విషయంలో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటాను. అంతమంది జనం, హడావుడి మధ్యలో అనుకోకుండా పొరపాటు దొర్లింది. అందుకు బుమ్రా గారిని క్షమించమని కోరుతున్నాను. నేను నిజంగా ఆయన ఆటకు వీరాభిమానిని. ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి' అని ట్వీట్‌ చేశాడు.

 

 

చదవండి: ఈ సినిమా రిలీజ్‌లు ఎప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement