నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Kollywood Movie Mr X Streaming form this date On Ott | Sakshi
Sakshi News home page

Mr X Movie Ott: ఓటీటీకి భారత్‌ సీక్రెట్‌ మిషన్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

May 13 2026 3:10 PM | Updated on May 13 2026 3:28 PM

Kollywood Movie Mr X Streaming form this date On Ott

కోలీవుడ్‌ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన​్‌ ఇండియా మూవీ మిస్టర్‌ ఎక్స్‌. ఈ చిత్రానికి మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్‌సీస్ అభిమానులకు సింప్లీ సౌత్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో  గౌతమ్‌ కార్తీక్‌, శరత్‌ కుమార్‌ ,నటి మంజు వారియర్‌, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్‌, ఖాళీ వెంకట్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

మిస్టర్ ఎక్స్‌ కథేంటంటే..

1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్‌ క్యాప్సిల్స్‌ నేపథ్యంలో సాగే కథే మిస్టర్‌ ఎక్స్‌. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement