ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.
అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.


