85 ఏళ్ల నిర్మాత.. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య | Tamil Producer K Rajan Dies At Age Of 85, Tamil Film Industry Mourns Veteran Producer | Sakshi
Sakshi News home page

K Rajan: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నిర్మాత మృతి

May 17 2026 7:34 PM | Updated on May 18 2026 11:50 AM

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)

తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.

నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్‌లు, మూవీ ఈవెంట్స్‌లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement