పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌ | Pooja Hegde Glamorous Photoshoot Goes Viral, Faces Backlash And Praise Online, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌

May 13 2026 8:46 AM | Updated on May 13 2026 10:05 AM

Netizens Trolls Pooja Hegde Latest Post

ఎవరేమనుకున్నా కథానాయికల్లో 99 శాతం మంది గ్లామర్‌ తోనే గుర్తింపు పొందాలని భావిస్తారు. అవకాశాల వేటకు గ్లామరస్‌ ఫొటోలనే వాడుతుంటారు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదనే సాహసం ఎవరు చేయలేరు. అందాల పోటీల్లో పాల్గొని ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసిన బ్యూటీ ఈమె. 2012 లో ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ అమ్మడి పేరు  వెలుగులోకి వచ్చింది. అలా టాలీవుడ్‌ లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మొదట్లో యువ హీరోలతో జత కట్టి, ఆ తరువాత మహేష్‌ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్‌ వంటి ప్రముఖ హీరోలతో నటించి స్టార్‌ డమ్‌ను పొందారు.

అయితే ఆ మధ్య పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో  అక్కడ డిమాండ్‌ తగ్గింది. అదే విధంగా హిందీలో నటించిన చిత్రాలేవీ సక్సెస్‌ కాలేదు. కోలీవుడ్లోనూ ఈ భామకు అదే పరిస్థితి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారు.

 అందులో భాగంగా తన ఆదిలో తీసుకున్న గ్లామరస్‌ ఫొటోలను తన ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్ల విమర్శలను గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. ఇంతకు రెట్రో వంటి చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే నేనా ఈమె అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొంతమంది ‘పూజాహెగ్డే కాస్తయినా సంసార పక్షంగా కనిపించేది ఇక్కడేననీ(సౌత్‌ సినిమాల్లో), బాలీవుడ్‌లో అయితే వేరే లెవెల్‌ అంటూ తన ఎక్స్‌ఫోజింగ్‌ ఫొటోల గురించి చాలా బోల్డ్‌గా పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement