కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే? | Megastar Chiranjeevi Calls To Tamil Nadu CM Vijay | Sakshi
Sakshi News home page

Chiranjeevi: సీఎం విజయ్‌కు చిరంజీవి ఫోన్.. ఏం మాట్లాడారంటే?

May 15 2026 7:38 PM | Updated on May 15 2026 7:44 PM

Megastar Chiranjeevi Calls To Tamil Nadu CM Vijay

తమిళనాడు సీఎం విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్‌లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.

చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు.   ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement