అంబులెన్స్‌కు స్వచ్ఛందంగా దారిచ్చిన వైఎస్సార్ సీపీ శ్ర
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరో సారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు నగరంలోకి రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళ్లేందుకు అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారిచ్చారు. అంతేకాకుండా.. దారిపొడవునా యువకులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు అంబులెన్స్ వస్తుంది... పక్కకు తొలగండి అంటూ అంబులెన్స్‌కు దారిచ్చి పంపారు.


